Friday, October 15, 2010

సోదరులు

'అయోధ్య'

అయోధ్య విషయము లో ప్రధాన 'కక్షిదారులు ' నిర్మోహి అఖారా కు చెందిన పంచ్ రామ దాస్; రామ జన్మభూమి ట్రస్ట్ సీనియర్ సభ్యుడు రాం విలాస్ వేదాంతి; హషీం అన్సారీ లు 8-10-10 నాడు కలుసుకొని, పరిష్కారం కోసం మంతనాలు జరిపి, ఒక రాజీ సూత్రం రూపొందించారు. ఈ విషయం లో కోర్టు తీర్పుని కూడా పరిగణనలోకి తీసుకొని, అందరికీ ఆమోదయోగ్యం గా వుండేలా రూపొందించామని చెప్పారు. యెవరైనా సుప్రీం కోర్టుకి వెళినా, తమ ప్రయత్నాలు మానబోమని ప్రకటించారు.

రజకీయ నేతలు ప్రకటనలు చేయడం మానుకోవాలి అని హితవు చెప్పారు.


ఈస్లామిక్ ఉగ్రవాదం :

8-10-10 : ఉత్తర అఫ్గానిస్థాన్ లో ఓ మసీదులో బాంబు పేలి, కుందుజ్ రాష్ట్ర గవర్నరు తో పాటు 15 మంది దుర్మరణం. ఈ దాడి లో ఆయనతోపాటు మసీదు ఇమం, పలువురు ఉన్నతాధికారులు కూడా మరణం.
----------------------------------------------------------

మావిస్టులు :

9-10-10 : గడ్చిరోలి జిల్లాలో పేల్చిన మందుపాతరకి ముగ్గురు ఈట్భ్ఫ్ జవాన్లు బలయ్యారు. అనంతరం జరిగిన ఎదురుకాలుపులలో వాళ్లు విసిరిన గ్రెనేడ్ ఓ పాఠశాలపై పడి, ఇద్దరు విద్యార్థులతో సహా నలుగురు దుర్మరణం చెందారు. పలువురు గాయపడ్డారు.

Monday, October 4, 2010

ఇస్లామిక్ తీవ్రవాదం

"ముస్లిం సోదరులు" అనే జాతి

మన తెలుగు మీడియా కి ఈ ప్రత్యేక జాతి అంటే ప్రత్యేకాభిమానం--అలాంటి జాతేదీ లేకపోయినా, పుట్టించి, పెంచి, ఓ జాడ్యం లా అందరికీ అంటకడుతున్నారు.

మహమ్మదీయులు "అందరితోనూ"--మనదేశం లో గానీ, ఇతర దేశాల్లో గానీ, so called ఇస్లామిక్ దేశాల్లో గానీ--ఎవరికీ ఏ సమస్యా లేదు.

వాళ్లలో ఓ భాగమైన "సున్నీ" జాతి తోనే! ప్రపంచ వ్యాప్తం గా ఉగ్రవాదాన్ని పోషిస్తున్నవాళ్లు వాళ్ల లోని ఒళ్లు బలిసిన వాళ్లు కొంతమందే!

అంతమాత్రానికి, మహమ్మదీయులందరినీ "ముస్లిం"లు అనీ, "ముస్లిం తీవ్రవాదం", "ఇస్లామిక్ ఉగ్రవాదం" అనీ అనడం ఏమి సబబు?

"మతసామరస్యం" పేరుతో ఆ "సున్నీ"లని ప్రత్యేకం గా దువ్వవలసిన అవసరం యేమిటి?

షియాలు సహజం గా నెమ్మదస్తులు. దైవ భక్తి కలవారు. వీళ్లలో చాలామంది అల్లాహ్ తో పాటు గంగమ్మనీ, ఆంజనేయుణ్ణీ, గ్రామదేవతల్నీ కూడా పూజిస్తారు. సిందూరాన్ని కంఠం మీద బొట్టులా ధరించేవాళ్లు కూడా వున్నారు. ఇతరకులాల వాళ్ల సంగతి చెప్పనే అఖ్ఖరలేదు.

మన లౌకిక వాదులకి ఇవన్నీ తెలుసు--కానీ మహమ్మదీయులందరినీ ఒకే గాటకట్టి, వాళ్ల తో సామరస్యం అని, అదో జాడ్యం లా వ్యాపించడానికి కృషి చేస్తూంటారు.

వీళ్లని "కుహనా" లౌకికవాదులు అని యెవరైనా అంటే, అదేదో బూతు మాటలా, చాలా ప్రమాదకరమైన తిట్టులా, తీవ్రవాది అని తిట్టడం తో సమానం గా భావించి--కోపాలు పొడుచుకొస్తున్నాయి. ఈ పదానికి అర్థం కేవలం "డూప్లికేట్" అనీ, అసలైంది కాదు అని మాత్రమే అని వీళ్లు గ్రహిస్తే మంచిది.

సెక్యులరిజానికి అసలు అర్థం ప్రకారం "మతప్రసక్తి లేని లౌకికత్వం" మన దేశం లో గానీ, పాకిస్థాన్ లాంటి దేశాల్లో గానీ ఇప్పుడప్పుడే వస్తుందనీ, అది సాధ్యమనీ యెవరూ ఆశించరు. భుట్టో ప్రారంభించిన వెయ్యేళ్ల యుధ్ధం పూర్తయ్యేటప్పటికి, ఇన్షా అల్లాహ్.....ఈ భూ ప్రపంచం, మన దేశాలూ ఇంకా అలాగే వుంటే, అప్పుడేమైనా ఛాన్స్ వుంటుందేమో!

ఈ లోగా మన రాజ్యాంగం చెపుతున్న "సర్వమత సమభావన" చాలు మనకి. కానీ కుహనా లౌకికవాదులు మాత్రం తయారు కాకూడదు అని నా ఆకాంక్ష.

ఇక మన మీడియా వాళ్లు, ముఖ్యం గా అయోధ్య తీర్పు తరవాత, మళ్లీ మత సామరస్యం గురించి పాటు(ట్లు) పడుతూ, "ఫాలానా వాళ్లూ ముస్లిములే, వీళ్లూ ముస్లిములే, వాళ్లూ ముస్లిములే" అంటూ యెక్కడెక్కడి విషయాల్నీ తవ్వి తీసి, ప్రచారం మొదలెట్టారు.

...........తరువాయి మళ్లీ ఇంకోసారి.

Thursday, September 23, 2010

"శుక్లాంబరధరం విష్ణుం......"

వినాయక రంజాన్

"మెహా గేణపదిం మెనసా జ్మరామి......."

వినాయక చవితిపూటా, ప్రొద్దున్నే ఓ బ్లాగు తెరవగానే, శ్రావ్యం గా వినిపిస్తూంది--మహమ్మదీయురాలు షబానా అజ్మీ ఓ సినిమాకోసం ఖష్టపడి నేర్చుకొని, పాడిన పాట!

కాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం కొంత అన్నట్టు, అందులో 3 పాళ్లు అరవ సాంబారు వాసన, ఓ పాలు సంస్కృతం, అప్పుడప్పుడూ కాస్త తెలుగు స్వరం!

ఇక హారం లోకి వెళ్లి అదేదో ప్రదేశ్ మీడియా కబుర్లు లోకి జొరబడితే, ఆహా! కన్నులపండువ--ఓ రేఖా చిత్రం--వినాయకుడు తన తొండాన్ని 'అర్థ చంద్రాకారం ' లో నిలబెట్టాడు. ఆ ఆకారం మధ్యలో ఓ నక్షత్రాన్ని చిత్రించాడు వాడెవడో కార్టూనిస్టుట! (ఇది ఖచ్చితం గా కార్టూన్ కాదు కదా?)

పైన వ్యాఖ్య, "అందరికీ వినాయక చవితి/రంజాను శుభాకాంక్షలు" అంటూ!

యెంతబాగుందండీ!

వినాయకుడి పొట్టపగిలేలా చేసినవాడు చంద్రుడు! తనకి ఆగర్భ శతృవు! వాడి ఆకారం లో తన తొండాన్ని వుంచడమా!

దానిమీదో నక్షత్రమా! అక్కడనించి, రంజాను శుభాకాంక్షలా! యెక్కడికి పోతున్నాం మనం?

ఇంగ్లీషులో ఓ సామెత వుంది--"మోర్ లాయల్ దేన్ ది కింగ్" అని! రాజు కన్నా, రాజుగారికి యెక్కువ విశ్వాసపాత్రుడు అని అర్థం చేసుకోవచ్చు మనం.

అలా--మహమ్మదీయులకే లేని "దూల" మీకెందుకంటా?

హారం లో యే వొక్కటైనా మహమ్మదీయుడి బ్లాగు వుందా? యెవడైనా తెలుగులో రాస్తున్నాడా? ఇంకే కూడలి, చెత్తా, చెదారం లో అయినా, మహమ్మదీయుడెవడైనా హిందువులకి వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పాడా?

షియా అనుకుంటా, ఎన్ రహంతుల్లా మాత్రం అప్పుడప్పుడూ మన బ్లాగుల్లో తన చక్కటి కామెంట్లు పెడుతూంటాడు. ఆయనా--అసలైన మహమ్మదీయుడంటే!

ఇకనైనా మన మహా విశ్వవ్యాప్త, సర్వమత సమానత్వ, లౌకిక, ఇంకేదో పిచ్చితనాన్ని విడనాడుదామా? కొనసాగిద్దామా?

ఇక్కడనించీ, నేను ప్రతీ టపాలోనూ, వివిధ దేశాల్లో "ఇస్లామిక్ టెర్రరిజం" కి బలయినవాళ్ల వార్తల్నీ, "మావిస్ట్" తీవ్రవాదానికి బలయినవాళ్ల వార్తల్నీ, విమానాలకీ, ఛాపర్లకీ "తృటిలో తప్పిన" ప్రమాదాలనీ  వ్రాస్తాను.

చదవండి--కొనసాగించండి!

కాశ్మీరులో 18-09-2010 న కాల్పుల్లో ముగ్గురు మృతి. 30 మందికి గాయాలు.

బగ్దాదులో 19-09-2010 న పేలిన కారు బాంబు. 31 మంది మృతీ, 70 మందికి పైగా తీవ్ర గాయాలూ.

----------------------------------------------------------

19-09-2010 న ఒరిస్సాలో కోరాపుట్ జిల్లలో 20 మంది సాయుధ మావిస్టుల దాడి, ఓ తండ్రీ కొడుకుల హతం

----------------------------------------------------------

19-09-2010 న హర్యానా సీ ఎం హెలికాప్తర్ కి తృటిలో తప్పిన ప్రమాదం. బురదలో కూరుకుపోయిన చక్రం.

అదేరోజు, సాంకేతిక లోపం కారణం గా, "కింగ్ ఫిషర్" విమానం బెంగళూరు నించి గన్నవరానికి 35 నిమిషాలు అలస్యం గా వచ్చి, మళ్లీ గంటన్నర తరవాత బెంగళూరు కి బయల్దేరిందట. ఇందులో వై ఎస్ ఆర్ భార్య విజయ లక్ష్మి, పులివెందుల ఎం ఎల్ ఏ మరో విజయలక్ష్మి, వై ఎస్ జగన్ భార్య భారతి వెళ్లారట.

Wednesday, September 22, 2010

లౌకికత్వము

పరమత సహనము

మన ఇండియా, దటీజ్ భారత్ లో ప్రతీవాడు తనను మించిన సెక్యులరిస్ట్ వేరెవడూ లేడని చెప్పుకుంటాడు.

మన రాజ్యాంగం ఉద్దేశించినది "మత ప్రసక్తి లేని లౌకిక" రాజ్యాన్ని.

ఇందిరాగాంధీ పుణ్యమా అని, దాన్ని "సర్వమత సమభావ లౌకిక" అని మార్చేశారు.

అక్కడినించే మొదలయ్యాయి అనేక నాటకాలు. అందరూ అందులో పాత్రధారులే.

టపా కోసం ఎదురుచూస్తు ఉండండి.