'అయోధ్య'
అయోధ్య విషయము లో ప్రధాన 'కక్షిదారులు ' నిర్మోహి అఖారా కు చెందిన పంచ్ రామ దాస్; రామ జన్మభూమి ట్రస్ట్ సీనియర్ సభ్యుడు రాం విలాస్ వేదాంతి; హషీం అన్సారీ లు 8-10-10 నాడు కలుసుకొని, పరిష్కారం కోసం మంతనాలు జరిపి, ఒక రాజీ సూత్రం రూపొందించారు. ఈ విషయం లో కోర్టు తీర్పుని కూడా పరిగణనలోకి తీసుకొని, అందరికీ ఆమోదయోగ్యం గా వుండేలా రూపొందించామని చెప్పారు. యెవరైనా సుప్రీం కోర్టుకి వెళినా, తమ ప్రయత్నాలు మానబోమని ప్రకటించారు.
రజకీయ నేతలు ప్రకటనలు చేయడం మానుకోవాలి అని హితవు చెప్పారు.
ఈస్లామిక్ ఉగ్రవాదం :
8-10-10 : ఉత్తర అఫ్గానిస్థాన్ లో ఓ మసీదులో బాంబు పేలి, కుందుజ్ రాష్ట్ర గవర్నరు తో పాటు 15 మంది దుర్మరణం. ఈ దాడి లో ఆయనతోపాటు మసీదు ఇమం, పలువురు ఉన్నతాధికారులు కూడా మరణం.
----------------------------------------------------------
మావిస్టులు :
9-10-10 : గడ్చిరోలి జిల్లాలో పేల్చిన మందుపాతరకి ముగ్గురు ఈట్భ్ఫ్ జవాన్లు బలయ్యారు. అనంతరం జరిగిన ఎదురుకాలుపులలో వాళ్లు విసిరిన గ్రెనేడ్ ఓ పాఠశాలపై పడి, ఇద్దరు విద్యార్థులతో సహా నలుగురు దుర్మరణం చెందారు. పలువురు గాయపడ్డారు.