"ముస్లిం సోదరులు" అనే జాతి
మన తెలుగు మీడియా కి ఈ ప్రత్యేక జాతి అంటే ప్రత్యేకాభిమానం--అలాంటి జాతేదీ లేకపోయినా, పుట్టించి, పెంచి, ఓ జాడ్యం లా అందరికీ అంటకడుతున్నారు.
మహమ్మదీయులు "అందరితోనూ"--మనదేశం లో గానీ, ఇతర దేశాల్లో గానీ, so called ఇస్లామిక్ దేశాల్లో గానీ--ఎవరికీ ఏ సమస్యా లేదు.
వాళ్లలో ఓ భాగమైన "సున్నీ" జాతి తోనే! ప్రపంచ వ్యాప్తం గా ఉగ్రవాదాన్ని పోషిస్తున్నవాళ్లు వాళ్ల లోని ఒళ్లు బలిసిన వాళ్లు కొంతమందే!
అంతమాత్రానికి, మహమ్మదీయులందరినీ "ముస్లిం"లు అనీ, "ముస్లిం తీవ్రవాదం", "ఇస్లామిక్ ఉగ్రవాదం" అనీ అనడం ఏమి సబబు?
"మతసామరస్యం" పేరుతో ఆ "సున్నీ"లని ప్రత్యేకం గా దువ్వవలసిన అవసరం యేమిటి?
షియాలు సహజం గా నెమ్మదస్తులు. దైవ భక్తి కలవారు. వీళ్లలో చాలామంది అల్లాహ్ తో పాటు గంగమ్మనీ, ఆంజనేయుణ్ణీ, గ్రామదేవతల్నీ కూడా పూజిస్తారు. సిందూరాన్ని కంఠం మీద బొట్టులా ధరించేవాళ్లు కూడా వున్నారు. ఇతరకులాల వాళ్ల సంగతి చెప్పనే అఖ్ఖరలేదు.
మన లౌకిక వాదులకి ఇవన్నీ తెలుసు--కానీ మహమ్మదీయులందరినీ ఒకే గాటకట్టి, వాళ్ల తో సామరస్యం అని, అదో జాడ్యం లా వ్యాపించడానికి కృషి చేస్తూంటారు.
వీళ్లని "కుహనా" లౌకికవాదులు అని యెవరైనా అంటే, అదేదో బూతు మాటలా, చాలా ప్రమాదకరమైన తిట్టులా, తీవ్రవాది అని తిట్టడం తో సమానం గా భావించి--కోపాలు పొడుచుకొస్తున్నాయి. ఈ పదానికి అర్థం కేవలం "డూప్లికేట్" అనీ, అసలైంది కాదు అని మాత్రమే అని వీళ్లు గ్రహిస్తే మంచిది.
సెక్యులరిజానికి అసలు అర్థం ప్రకారం "మతప్రసక్తి లేని లౌకికత్వం" మన దేశం లో గానీ, పాకిస్థాన్ లాంటి దేశాల్లో గానీ ఇప్పుడప్పుడే వస్తుందనీ, అది సాధ్యమనీ యెవరూ ఆశించరు. భుట్టో ప్రారంభించిన వెయ్యేళ్ల యుధ్ధం పూర్తయ్యేటప్పటికి, ఇన్షా అల్లాహ్.....ఈ భూ ప్రపంచం, మన దేశాలూ ఇంకా అలాగే వుంటే, అప్పుడేమైనా ఛాన్స్ వుంటుందేమో!
ఈ లోగా మన రాజ్యాంగం చెపుతున్న "సర్వమత సమభావన" చాలు మనకి. కానీ కుహనా లౌకికవాదులు మాత్రం తయారు కాకూడదు అని నా ఆకాంక్ష.
ఇక మన మీడియా వాళ్లు, ముఖ్యం గా అయోధ్య తీర్పు తరవాత, మళ్లీ మత సామరస్యం గురించి పాటు(ట్లు) పడుతూ, "ఫాలానా వాళ్లూ ముస్లిములే, వీళ్లూ ముస్లిములే, వాళ్లూ ముస్లిములే" అంటూ యెక్కడెక్కడి విషయాల్నీ తవ్వి తీసి, ప్రచారం మొదలెట్టారు.
...........తరువాయి మళ్లీ ఇంకోసారి.
1 comment:
ముస్లిం ఉగ్రవాదం,హిందూ ఉగ్రవాదం,క్రైస్తవ ఉగ్రవాదం లాంటి శీర్షికలు అనవసరం.నమాజు చేసుకొని ప్రశాంతంగా బతికే సాధారణ సాయిబుకి తీవ్రవాదులతో ఏమీ సంబంధం ఉండదు.తీవ్రవాదులను ఎదుర్కోవటానికి ఎంతో దైర్యం కావాలి, ముస్లిముల్లోని నా లాంటి కోట్లాది సౌమ్యులు శాంతికాముకులు దౌర్జన్యం చేయలేరు.ఉగ్రవాదుల అధర్మాన్ని ఎదిరించలేరు.అప్పుడే పుట్టిన బిడ్డకు కులం,మతం గురించి తెలియదు కాని కాలక్రమేణా దాని గురించి తెలుపుతాము.ఉగ్రవాదమే హంతకుల ప్రత్యేక మతం.వారు ఎవరు చెప్పినా వినరు.కత్తి తీసుకొని వీరంగం వేసే వాడి ముందుకు కత్తి పట్టలేని మీరు వెళ్ళగలరా? కత్తిపట్టే వాడికి తుపాకి పట్టే పోలీసులు,సైనికులే సరైన జవాబు.అందుకని ఆ మతం ఈమతం అని చూడకుండా దొరికిన తీవ్రవాదిని దొరికినట్లు జైల్లో తొయ్యడమే సరైన మార్గం.
Post a Comment